ముక్కంటి నుదుటన నిలువు నామాలు..
శివ కేశవులొకటని తెలుపు చిహ్నాలు..
భేదభావాలెరుగని భగవంతులు వారు…
ఆదిమధ్యాంతరాలెరుగని ఆది మూర్తులు వారు…
కరములెత్తి ప్రార్ధించి ఖర్మను
తొలగించుకొందము…
కంఠస్వరములతో పూజించి జన్మను సాఫల్యము చేసుకొందము…
పాహిమాం..అన్న ఒక్క స్వరం చాలు..
విన్నంతనే ఇచ్చేరు దీవెనలు పదివేలు..
రక్షమాం..అన్న ఒక్క పదం చాలు…
కనినంతనే వచ్చేరు తీర్చేయగ కష్టాలు..
శివరాతిరి జాగారం..శివుని సంబరం..
ఏకాదశి ఉపవాసం..శ్రీ విష్ణు సంతసం..
ఇద్దరూ ఇద్దరే ఈ లోకానికి రెండు కళ్లు..
మన కడగళ్లను తుడిచేందుకు ఉద్భవించిన దేవుళ్లు…
పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా…