ఓం నమఃశ్శివాయనమః

ఓం నమఃశ్శివాయనమః

ఏ నోము నోచావే బిల్వమా…

ఫాల నేత్రాన నీకు ప్రధమ స్థానమా…

ఎంతిష్టమైనావే శివునికి బిల్వమా…

ఎటులనో మాకు కాస్తైన తెలుపుమా…

స్పష్టంగ ఆ దారి చూపుమా..నేస్తమా..

ఏ కష్టమెదురొచ్చినా ఎదురొడ్డి తనమనసు గెలవమా…

చెప్పవే…బిల్వమా…చెప్పవే…

మా…రేడు..మారేడు 

దళ ప్రీతి ఎటులైననో చెప్పవే…

 ప్రాముఖ్యమయ్యావు తన పూజలో…

పరిపూర్ణమైంది నీ జన్మ తన సేవలో…

నీ కొమ్మలో నేనొక రెమ్మనై పుట్టనా…

ఆ తండ్రి పాదాలు తాకి ముక్తినే పొందనా…

మరుజన్మ వరమిస్తే తాను నీ మానునై పుడతాను….

కాదనక కరుణిస్తే నేను తన సేవకుడి నవుతాను….

పాహిమాం…పాహిమాం..పరమేశ్వర 

మా కోర్కె ఫలియించు వరమియ్యరా..

Leave a Comment

Scroll to Top