ఉజ్జయినీ పుర నివాసా…గాంభీరమేల నీకు….
కైలాస గిరి నివాసా…కారుణ్యమే ముదము నీకు…
జగతి హారతి పట్టును జయ జయ ధ్వానాలతో జంగమయ్యా…
భక్తి మార్గమున నడిపించి మము బ్రోవమని మొక్కునయ్యా…
పాహిమాం….పాహిమాం..పాహిమాం..శివా..
రక్షమాం…రక్షమాం..రక్షించరారా..శివా.
విశ్వనగరసామ్రాజ్యాధినేతవై వీక్షించు విశ్వనాథా..
నీ విశాల హృదయాన అణువంత చోటు మాకివ్వరాదా…
సాక్షాత్కరించవయా శివా…సాష్టాంగ ప్రణామాములతో పలికేము స్వాగతములు నీకు….
అరుదెంచవయా శివా…అష్టోత్తర శతనామాల సుస్వరాలతో పూజలను చేసేదము నీకు…