కనగ మహారాజు శివుడు…

కనగ మహారాజు శివుడు…
మనసున్న మా రాజు మన హరుడు…
వినగ తన నామమే మనమెపుడూ..
మనకు మన వాడుగనే తోచునతడు…
తోడుగుంటునంటాడు శివుడు…
నీడలా ఉండునంటాడు హరుడు…!!కనగ!!

సద్దుమణిగిన వేళ,నిద్దురోయే వేళ తనని మరచిపోతము మనము…
పొద్దుపోడిచే దాక,నిదుర లేచే దాక
మనది కాని తనువు తనకిచ్చి మనము..
ఉదయసంధ్యలలో ఉత్తేజముతో మనని మేల్కొల్పునతడు….
బ్రతుకు బండిని లాగు శక్తినిచ్చి దీవించి పంపునతడు…
ఎంత దయరా శివా నీకు మాపైన…
తట్టుకోగలదా శివా..మా మనసు కాస్తయినా…
ఏమిస్తే తీరునురా శివా నీ ఋణం…
అర్ధం కాక చేతులెత్తి నమస్కరిస్తూ నిలుచుంది నీ ముందర ఈ ప్రాణం..
పాహిమాం..పాహిమాం..శివా…
పది పదుల వందసార్లైనా జన్మించాలని ఉంటుందిరా శివా… నీ కరుణ కోసం…

Leave a Comment

Scroll to Top