ఓం నమః శివాయనమః
అడిగిందే తడవుగా అభయమిచ్చినావా…
ప్రసన్నముగ కాన దివి నుండి భువికి దిగివచ్చినావా..
రవికిరణ తేజోమయ రమ్యమూర్తీ…
పొగడతరమా మాకు నీ లీలామృత దివ్య కీర్తి….
పండు వెన్నెల గనులైన నీ కనుల వీక్షణములు….
ఎంత తొలిచినా తరగని నీ ప్రేమ నిధి నిక్షేపములు…
ఆహ్లాదముగ నున్న నీ ముద్దు మోముని గని…
మార్కండేయునుని మించి భక్తులవమా శివా నీకు….
హాల హలము మింగావు లోక కల్యాణమునకని…
కోలాహలముగా తిరునాళ్ళ నే చేయమా ఏళ్ల తరబడి మా ఋణము తీరగా నీకు…
పాహిమాం..పాహిమాం..శివ శంకరా…
పద నివేదనలు పరికించి రక్షించరా…