ఓం హరా శంకరా…హర హర ఓం హరా శంకరా…
మా దన్ను గా నిలువరా శంకరా…
ముక్కన్ను తెరవద్దు రా హర హరా..
రుధిర వర్ణాల నున్న నీ నేత్రాలు
కనగ సాధ్యమా శివా బ్రహ్మాకైనా…
చిరునగవులే కనరాని నీ మోము
కనగ సాహసించ గల వారమా శివా మేమైన…
సకల ప్రాణి కోటి కోరేది నీ ప్రేమ రూపమే…
తరించుటకు స్మరించునదీ నీ నామ జపమే…
విరివిగా విరి మాలలే వేశాము పరిమళాలతో నిను ప్రసన్నము చేయగా…
శ్రావ్యముగా కీర్తనలే పాడేము స్వర మధురిమల తో పరవశించిన నీ మోమున పున్నమి కళలు చూడగా…
పాహిమాం..పాహిమాం..శివా పాహిమాం…
ప్రసన్నుడవై మము కనికరించు శివా రక్షమాం…