నేను...నా గురించి....
నా పేరు పచ్చిపులుసు సూర్యనారాయణ మా తల్లిదండ్రులు శ్రీ పచ్చిపులుసు రాజగోపాల్,సీతమ్మల రెండవ కుమారుడిని….మాది రాజంపేట గ్రామం అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దాదాపు ముప్పై వేల పై చిలుకు కీర్తనలు రచించిన శ్రీ శ్రీ శ్రీ అన్నమాచార్య గారు జన్మించిన తాళ్ళపాక గ్రామం కి దగ్గరలో వుండడం నేను చేసుకున్న అదృష్టం… అంతటి మహానుభావుడు నడయాడిన ప్రాంతం లో జన్మించడం వలననో ఏమో అన్నమాచార్య భక్తి లో ఒక పరమాణువంత భక్తి నాకు సంప్రాప్తించి ఆ కైలాస నాథునికి రోజుకొకటి చొప్పున పాటలు వ్రాయగలిగాను…వ్రాస్తూనే వున్నాను…ఇందులో కొన్ని పాటలకు సంగీతం కూడా చేయించడం జరిగింది… ఈ పాటలను https://www.youtube.com/@aneelacreations6862 ద్వారా వినవచ్చు…వీక్షించవచ్చు…
సంకల్పం.....
ఈ గీత యాగంలో ఉద్భవించిన గీతాలను యావత్ ప్రపంచంలో వున్న శివ భక్తులకి చేరువవ్వాలని ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షములతో అందరూ సంతోషంగా వుండాలని ఆశతో మీ ముందుకు తీసుకొచ్చాను.
ఈ ప్రయాణంలో స్వామి వారి సేవలో తరిస్తున్నందుకు గొప్ప సంస్థలచే పురస్కారాలు పరమేశ్వరుని ప్రసాదంగా అందుకోవడం జరిగినది.
- ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్
- గుంటూరు NTR కల్చరల్ అసోసియేషన్ వారిచే “సాహిత్యరత్న” పురస్కారము
- గుంటూరు కళాదర్బార్ అవార్డ్
- విజయవాడ అన్నసంతర్పణ సమితి ట్రస్ట్ అవార్డ్