సుందరాకృతిన శంకరా..నిను గాంచినాక…

ఓమ్ నమ:శ్శివాయ నమ:
 
సుందరాకృతిన శంకరా..నిను గాంచినాక…
మదిన పుణ్య స్పందనలు ఉప్పొంగినాక…
పడనివాడెవ్వడు శంకరా…ఈ జగతిలో…
పడకతప్పదట ఎవ్వరైన నీమాయలో…!!సుందరా!!
 
ఏ స్వార్థమూ కనరాని నీ మాయా ప్రపంచాన…
విహరిస్తే ధన్యమే కదా..తుది దాక మా జీవితాన…
ఏనాటికీ తెగిపోని బంధమనులాగా…
అనుసంధానమవుతావు…ఆత్మ బంధువులాగా…
నిన్ను మించిన దైవము వేరొకరు కలరా?
కన్ను మిన్ను కానక చేసిన తప్పులను కూడా మన్నించు కరుణామయుడు ఇంకొకరు కలరా?!!సుందరా!!
 
ఆకసానికి ఉండునేమో సరిహద్దులు…
నీ భక్తి వికాస తరంగిణికి లేవు ఏ సరిహద్దులు…
ధ్యాన ముద్రలో కూర్చోని కాననీ ఈ విశ్వమంతా…
అజ్ఞానానందకారమునుండి బయటపడి నను చూడనీ నీ సృష్టినంతా…
అని తలచుకుంటూ కలగననీ ప్రతి రాతిరి…
కలనిజమైన ప్రతి రాతిరీ నాకు శివరాతిరి…!!సుందరా!!
 
పాహిమాం..పాహిమాం.. పరమేశ్వరా.. పాహిమాం..
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top