ఓమ్ నమ:శ్శివాయ నమ:
ఏమన్నదో వింటివా ముక్కంటి…నా హృదయము…
ఈ మదిని గుడి చేయమంటోంది శంకరా…నీకోసము..
వచ్చి ఉండిపోవయ్య మా గుండె గర్భగుడిలో….
కలలు తీర్చంగ కలిసిపోవయ్య మా హృదయాంతరంగాలలో…!!ఏమన్నదో!!
ఏమాట కామాట.. అడుగుతాను నిన్నొకమాటా…
ఎందుకయా శంకరా…ఒక్కసారి దర్శించుకుంటే చాలు..పడతావు మా వెంట..వెంట…
నీ మాయలో పడినంతవరకూ వదలనే వదలవంట…
ఇదొక్కటేనయా మాకు…నీతోటి తంట…
చెప్పనా నీకొక్క చేదు నిజము..పడ్డాక తెలిసింది నీ మాయలో మర్మము…
తెలిశాక తడిసాయి కనులు ఆనంద భాష్పాలతో అయ్యిందనీ జన్మ ధన్యము…!!ఏమన్నదో!!
ఉలుకు పలుకూ లేక ఒంటరిగా కూర్చుండేవు ఊరి చివరున్న దేవాలయములో…
ఎదురు చూస్తూవుండేవు దీవించ భక్తులని పట్టుకొని అక్షతలు నీ చేతిలో…
గంపెడాశతో గంగ తీర్థంబు తెచ్చి నీకు అభిషేకములు చేసినాక…
వెళ్లక తప్పని బంధాలు గురుతొచ్చి వెళ్ళిపోతుంటాము ఒంటరిగా నిన్నొదిలి నీతోనే ఉండలేక…
మన్నించరా శంకరా…ఈ జన్మనీ..
ధ్యాస మళ్ళించరా చేయగా నీ సేవనీ!!ఏమన్నదో!!
పాహిమాం..పాహిమాం..శివశంకరా.రక్