ఓమ్ నమ:శ్శివాయ నమ:
చూడ రెండు కళ్ళూ చాలవు శివయ్య..నీ సౌందర్య రూపమును..
ముక్తి నొసగే ముక్కంటి…నీ అర్దనారీశ్వరమును…
మరల మరల రాని ఈ పుణ్య క్షణములు…
క్షణము దాటితే మాకు దొరకునా..నీ కంటి కరుణ వీక్షణములు…
నమో వాక్కములు మీకు శివ శివానీ..
శతకోటి వందన పుష్ప పరిమళములు మీకు శర్వ శర్వాణీ..!!చూడ!!
ఆలుమగల అన్యోనతను చాటగా అయ్యారు..మీ ఇద్దరూ సగము సగము…
ఆదిదంపతులై ఆదర్శము తెలుపగా పంచుకున్నారు తనువు ఒకరికొకరు…
తల్లివై లాలించ ఒక చూపుతో….
తండ్రిలా పాలించ ఇంకొక చూపుతో..!!చూడ!!
ఏక కాలమున కలుగు పార్వతీ పరమేశ్వరుల దర్శనము…
లోకానికే వెలుగు శాంకరీ శంకరుల సమభాగ మేను సందర్శనము….
ప్రణమిల్లదా సృష్టి మొత్తమూ మీ ముంగిట…
పాడుతూ…ప్రస్తుతించదా నిలిచి పూల దోసిళ్ళతో మీ నామ స్వరమధురిమల పాట…
దివి నుండి దిగి వచ్చి దేవతలు అందరూ…
ఎంతో మనోహరమైన మీ దివ్య సౌందర్యమును దర్శించుకొని గొంతు కలపకుందురా వారందరు…!!చూడ!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…