కనగలమా పరమేశా..నిను కనగలమా..
నిప్పులు కురిసే నీ కళ్లకేసి…
మనగలమా జగదీశా..కని మనగలమా..
నీ కోపోద్రేకపు పరవళ్లకు జడిసి…
పాహిమాం..పాహిమాం..రుద్రరూపాయా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..రౌద్ర నేత్రాయ రక్షమాం…
శాంతము నీకు అందమయా శివా…
ఆ సౌందర్యమే మాకానందమయా శివా…
దక్షుడు లేడు శివా..దండింప…
ఆ కాముడు లేడు శివా…దహియింప..
దయగల దేవా..మము కరుణింప…
సెలవియ్యవయా శివా..ఏ సేవన నిను శాంతింప…
తల్లిపార్వతీ..పలకరించమ్మ ఓసారి నీ పతిని నీ ప్రేమ పలుకులతో…
మా తండ్రి మదిని తడిపేయవమ్మ నీ చిన్ని చిరునవ్వుల చినుకులతో…
ప్రసన్నమైతే మా తండ్రి..హిమగిరి పుత్రీ…
పూయించదా అవనిపై ఆనందనందనాలు ఈ పుణ్యధాత్రి…
కదలిరావమ్మ కాత్యాయినీ…
ఉపేక్షించక వేగిరమున లోకపావని..
ముద్దు మాటలే వాడేవో…
లాలి పాటలే పాడేవో…
ముదము గా ముక్కంటి నిదురపోవాలి..
నిదురలో మా తండ్రి మామీద ప్రేమను కలను గా కనాలి…
పాహిమాం..పాహిమాం…పరమేశ్వరా..
పారిజాతాలతో నిను పూజించేము సర్వేశ్వరా…