కొత్త సంవత్సరారంభమున కొంగొత్తగా కోరునది ఏమియునూ లేదు శివా….

కొత్త సంవత్సరారంభమున కొంగొత్తగా కోరునది ఏమియునూ లేదు శివా….
నిత్యమూ నిను కోరుటదే…మము చల్లంగ చూడమని వినా వేరేది వలదు శివా….
నీ దయ ఉంటే చాలు శివా ఎన్ని  దశాబ్ధములైనా….
చేధించమా శివా…ఎన్ని దుర్భేధ్యములైనా….
పాహిమాం…పాహిమాం..పరమేశ్వర..పాహిమాం..
రక్షమాం…రక్షమాం..జగద్రక్షకా…రక్షమాం…

భోగ భాగ్యాలు మాకు వద్దయా శివా….
భువి లోన బువ్వకి ఎవ్వరూ చేజాచకుంటే అది చాలు శివా…
ధన కనక వస్తువాహనాలు మాకు ఢాంభికాలయా శివా…
నీ సేవలో తరియింప అవి మాకు బహు ప్రతిబంధకాలయా శివా….
కోపాలు,తాపాలు,రోషాలు,వేషాలు,మోసాల మధ్యనే మా జీవితాలు….
కాని అవి, త్యాగాలు,ప్రేమలు,మంచి మానవత్వాలు మచ్చుకైన కనరాని శుష్కించిన సుభాషితాలు….
ఙాన బోధ చేయవయా శివా ఓ సారి మా మనసులో దూరి…
ఆత్మ ప్రభోధాన్ని మాలో మేల్కొల్పవయా శివా తెలుసుకొనగ తాను సరైన దారి….
అందమైన నీ సృష్టి లో నిలిచిపోనీ శివా మమ్ము ఆణిముత్యాలుగా….
భావితరాలకు గుర్తుండిపోనీ శివా మమ్ము నగ్న సత్యాలుగా….
పాహిమాం….పాహిమాం..శివశంకర పాహిమాం….
రక్షమాం…రక్షమాం…లోకరక్షకా రక్షమాం….

Leave a Comment

Scroll to Top